Amaravathi : అమరావతిపై జగన్ కక్ష.. అందుకే ఆగింది..

Amaravathi :  అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోవడంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దే కీలక పాత్ర అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై అండర్ పాస్ లు, ఎక్సిట్ రహదారులను వేయకుండా జగన్ కుట్ర చేశారని.. రోడ్డును వేయించారని.. దాని వల్ల స్థానిక ప్రజలు దీన్ని వాడుకోకుండా కుట్ర చేశారని ఆరోపించారు. అలాగే ఎక్సిట్ రహదారులు లేకపోతే ప్రజలు ఎలా ఈ జాతీయ రహదారి ఎక్కుతారని ప్రశ్నించారు.

చంద్రబాబు నాడు ప్రతీ కిలోమీటర్ కు ఒక అండర్ పాస్ పెట్టాలని ప్రతిపాదిస్తే దాన్ని జగన్ పక్కనపెట్టి నిర్మించాడని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రతిపాదించి 450 కోట్లతో ప్రతీ కిలోమీటర్ కు అండర్ పాస్ పెట్టి జాతీయ రహదారి నిర్మిస్తోందన్నారు. దీనివల్ల మరో ఏడాదిన్నర కాలం , డబ్బులు వృథా అయ్యాయని.. గత జగన్ ప్రభుత్వ అవగాహనా రాహిత్యం కారణంగా అమరావతి పై కక్ష సాధింపుతో రాజధాని నిర్మాణ పనులను ఆపేసిందని ఆరోపించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

TAGS