Nitin Gadkari : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నేడు (గురువారం) తెల్లవారుజామున దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు కేంద్రమంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తోమాల సేవలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు. దేశ అభివృద్ధి కోసం పనిచేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని ప్రార్థించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వేదాశీర్వచనాలిచ్చారు. జేఈవో వీరబ్రహ్మం స్వామివారి శేష వస్గ్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. కేంద్రమంత్రి వెంట స్థానిక బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిన్న (బుధవారం) ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలువురు అధికారులతో సమావేశమయ్యారు. మరికాసేపట్లో ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.