
Bandi Sanjay and Chiranjeevi
Bandi Sanjay and Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని తన నివాసానాకా వచ్చిన బండి సంజయ్ కు చిరంజీవి సాదర స్వాగతం పలికారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి చిరంజీవితో బండి సంజయ్ కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ ను చిరంజీవి సన్మానించారు. ఈ సందర్భంగా వారిద్దరు పలు అంశాలపై చర్చించారు.
దీనిపై బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘అన్నయ్ మెగాస్టార్ చిరంజీవి గారెని కలవడం ఎప్పుడూ సంతోషదాయకమే. చిరంజీవి గారు వినయశీలి, నా శ్రేయోభిలాషి. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు అభిమానిని’’ అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.