Hardik Pandya : పాపం పాండ్యా..చివరకు భార్య కూడా..

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya : టీమిండియా స్టార్ క్రికెటర్ హర్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ ఏ ముహూర్తాన కెప్టెన్ గా చేసిందో అతడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి పాండ్యా పరిస్థితి దారుణంగా మారిపోయింది.

ముంబై కెప్టెన్ గా చాన్స్ వచ్చి ఎగిరి గంతేయాల్సిన సమయంలో రోహిత్ ఫ్యాన్స్ నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర నెగిటివ్ టాక్ మోయాల్సి వచ్చింది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ రోజు కూడా పాండ్యా సంతోషంగా లేనట్టు కనిపిస్తోంది. జట్టులో విభేదాలు, రోహిత్ ఫ్యాన్స్ తిరస్కరణ, తాను ఫామ్ లోకి రాకపోవడం..ఇలా చివరకు ఐదుసార్లు టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటి దారి పట్టడం పాండ్యాకు మరిచిపోలేని అనుభవం.

వృత్తి జీవితం ఇలా ఉంటే..వ్యక్తిగత జీవితం కూడా ఇలానే తయారైందని తెలుస్తోంది. పాండ్యాకు అతడి భార్య నటాషా విడాకులు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  అయితే ఈ వార్తలకు పలు ఆధారాలు, కారణాలు కూడా ఉన్నాయి.. హార్దిక్ పుట్టిన రోజు సందర్భంగా నటాషా ఎలాంటి పోస్ట్, విషెస్ కానీ చెప్పలేదు. దీంతో వీరి రిలేషన్ లో చీలిక వచ్చిందనే టాక్ నడుస్తోంది. గతంలో ఈ జంట తాము ఎక్కడికి వెళ్లినా అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు.

ఇటీవల వీరిద్దరి నుంచి ఎలాంటి ఫొటోలు లేకపోవడంతో విడాకుల రూమర్స్ కు మరింత బలం చేకూరుతోంది.  అయితే హార్దిక్ తన భార్య ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించకపోవడంతో ఇవన్నీ పుకార్లేనని పాండ్యా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. విడాకుల విషయమై పాండ్యా దంపతులు క్లారిటీ ఇచ్చేదాక మరిన్ని రూమర్స్ పెరుగతాయనడంలో సందేహం లేదు. కాగా, నటాషా బాలీవుడ్ హీరోయిన్ అని మనకు తెలిసిందే. వీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికో బాబు కూడా ఉన్నాడు.

TAGS