జర్నలిజం లో ఎంతో అపారమైన అనుభవం. అందనంత ఎత్తుకు ఎదిగింది. తాజా వార్తల పేరిట పేరు సంపాదించింది. కానీ ఏమి లాభం. ఎవరో ఇచ్చిన వాయిస్ ను తన ఛానల్ లో ప్రసారం చేసి పరువుపోగొట్టుకుంది టీవీ 9 ఛానల్. ఒక హద్దులాగా నిబంధనలు పెట్టుకొని భాద్యతాయుతంగా మెదులుకోవాలి. భాద్యతను మరచి విచక్షణారహితంగా వార్తలు ప్రసారం చేస్తానంటే , జనం ఆ ఛానల్ ను కంటికి ఎదురుగ కనిపించకుండా చేసుకుంటారు.
ఎవరో ఒక వ్యక్తి అనని మాటలను అన్నట్టుగా రికార్డ్ చేసి టీవీ -9 కు పంపారు. టీవీ-9 కె ఎందుకు పంపారంటే సాక్షి లో ఆ మాటలు ప్రసారం చేస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి టివి-9 కు పంపారు.చంద్రబాబు నాయుడు మాట్లాడకున్న మాట్లాడినట్టుగా గొంతు మార్చి మాట్లాడిన మాటలను రికార్డు చేసి టీవీ 9 కు పంపారు. చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా తాయారు చేసిన మాటలు. ఇంకేముంది ఆ మాటలు వినగానే టీవీ 9 ఎడిటోరియల్ సిబ్బంది ఎగిరి గంతు వేసింది. ఇది ప్రసారం చేస్తే భారీగా వ్యూస్, రేటింగ్ వస్తదని ఆశపడింది.
మీడియా ను ప్రజలు నమ్మినంత కలం జనంలో పట్టు ఉంటుంది. విశ్వాసం కోల్పోతే జనంలో పలుచనైపోయి పతనానికి దారితీస్తుంది.