TDP NRI Germany : జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఎన్నారై టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఐదేళ్ల జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్నారై టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ చాలా మంది ఎన్నారైలు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి, ఏపీకి వచ్చి ఎన్డీయే అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే అసాధారణ విజయం సాధించిందని కొనియాడారు. జగన్ లా ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వం చంద్రబాబుది కాదని గ్రీష్మ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంలో అందరం కూడా పాలుపంచుకుందామని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్నారై కోర్ కమిటీ సభ్యులు కుర్రా పవన్, బత్తల శివ, కొర్రపాటి సుమంత్, దాసరి వంశీ, కోనేరు నరేశ్, కుడితపూడి శ్రీకాంత్, కండ్ర వెంకట్, మిక్కిలినేని అనిల్ తదితరులు పాల్గొన్నారు.