Undavalli Sridevi : నందికొట్కూరు బరిలో ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీ టికెట్ ఖాయం చేసిన బాబు

Undavalli Sridevi

Undavalli Sridevi

Undavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవి… వైసీపీ ఎమ్మెల్యేగా తాటికొండ నుంచి గెలిచారు. అయితే జగన్ తీరుతో విసిగి వేసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి చంద్రబాబు పార్టీ కోసం పాటుపడ్డారు. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు.

తాజాగా ఉండవల్లి శ్రీదేవికి రాజకీయ , సామాజిక సమీకరణాల్లో టికెట్ ఇవ్వలేకపోయారు చంద్రబాబు. అయితే చివరి క్షణంలో బలహీన అభ్యర్థున్న చోట క్యాండిడేట్లను మార్చేస్తూ తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి శ్రీదేవికి రాయలసీమలోని కీలకమైన నందికొట్కూరు బరిలో నిలుపాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు టీడీపీ నందికొట్కూరు టికెట్ ఖాయం చేశారు. ఈరోజు సాయంత్రం కానీ.. రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంది.

నందికొట్కూరు సీమలో కీలకమైన సీటు.. ఇక్కడ వైసీపీ నుంచి బలమైన జగన్ మద్దతుదారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బరిలో ఉన్నారు. ఈయన ఎప్పుడూ చంద్రబాబు, టీడీపీపై నోరుపారేసుకుంటారు. బైరెడ్డిని ఓడించాలంటే అంతే బలమైన నేత కావాలని ఆశించిన బాబు.. ఈ మేరకు టికెట్ దక్కని ఉండవల్లి శ్రీదేవిని నందికట్కూర్ బరిలో నిలపాలని యోచిస్తున్నారు

ఎలాగైనా సరే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఓటమియే లక్ష్యంగా బాబు పావులు కదుపుతున్నారు. ఇందుకు మంచి వాక్చాతుర్యం, జనాల్లో మంచి పాపులారిటీ ఉన్న ఉండవల్లి శ్రీదేవిని బరిలోకి దించాలని బాబు డిసైడ్ అయినట్టు సమాచారం.

ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ కమ్మెల శ్రీధర్.. వైద్యుడిగా పేరుగాంచాడు. జర్నలిజంలో ఆయనకు ప్రవేశం ఉంది. టీవీ5 సహా పలు టీవీల్లో డాక్టర్ షోలు చేస్తూ పాపులర్ వైద్యుడిగా ఉన్నారు. ఆయన ప్రోద్బలంతోనే ఉండవల్లి శ్రీదేవి రాజకీయాల్లోకి వచ్చి మొదట వైసీపీలో.. ఇప్పుడు టీడీపీలో టికెట్ దక్కించుకొని కీలక నేతగా మారారు.

TAGS