Jagan Viral Meme : ‘కల్మషం లేని ప్రేమ’ మీమ్ వైరల్..

Unconditional Love- Jagan Viral Meme
Jagan Viral Meme : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల చిత్రాలు వైసీపీని భయపెడుతున్నాయి. జగన్ ఐదేళ్ల పాలనపై సోషల్ మీడియాలో విమర్శణ అస్త్రాలు కుప్పలు తెప్పలుగా ప్రత్యక్షం అవుతున్నాయి. మహా కూటమిగా ఏర్పడిన టీడీపీ+జనసేన+బీజేపీ మూడు పార్టీలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది వైసీపీ వ్యతిరేక మీమ్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ కూడా చేస్తున్నారు.
ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎదుగురు గాలి వీస్తుందని సర్వే రిపోర్టులు వినిపిస్తున్నాయి. దీనికి సోషల్ మీడియా కూడా తోడవడంతో ఇక వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. రీసెంట్ గా వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఒక మీమ్ గురించి తెలుసుకుంటే
‘ఒక అవ్వ వద్దకు వచ్చిన సీఎం జగన్ ఆ అవ్వతో మాట్లాడుతాడు. అవ్వా నీ పొలం కాగితాలు ఇవ్వు తాకట్టు పెడతాను’ అన్నట్లు మీమ్ క్రియేట్ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం భూములను తాకట్టుపెట్టి డబ్బు తీసుకుంటుందని టీడీపీ ఆది నుంచి ఆరోపిస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మీమ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.