NITI Aayog Meeting : మాట్లాడనీయడం లేదు : నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి మమత వాకౌట్
NITI Aayog Meeting : తనకు మాట్లాడేందుకు సరిపడా టైం ఇవ్వడం లేదంటూ నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ భేటీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. అయితే, తనకు మాట్లాడేందుకు సరిపడా టైం ఇవ్వకుండా అవమానించారని మమతా బెనర్జీ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.
తనకంటే ముందు మాట్లాడిన వారిి 20 నిమిషాల వరకు టైం ఇచ్చారన్నారు. కానీ, తనకు కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించారన్నారు. దీంతో తాను నీతి ఆయోగ్ సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. దేశంలోని రాష్ట్రాలపై ివక్షను చూపించొద్దని.. కేంద్రానికి చెప్పానని మమతా బెనర్జీ అన్నారు.
కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రాలపై పక్షపాతం చూపించారని ఆరోపిస్తూ నీతి ఆయోగ్ మీటింగ్ కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరుకాలేదు. ఇక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరల సఎం పినరయి విజయన్ తో పాటు ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ఢిల్లీ ప్రభుత్వాలు సైతం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాయి.