Uganda : ఉగాండా, పపువా న్యూ గినియా మధ్య జరిగిన గయానా లో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో ఉగాండా విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఉగాండా అనుకున్నట్లే సూపర్ బౌలింగ్ తో పపువా బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించింది. పపువా బ్యాటర్లు ఖాతా తెరవకుండానే 0 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. 19 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ 77 పరుగుల కు ఆలౌట్ అయింది. పపువా గినియా బ్యాటర్లలో కేవలం ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. మిగతా 8 మంది సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కాగా.. కేవలం నాలుగు ఫోర్లు, ఒక సిక్సు మాత్రమే బాదారు. ఉగాండా బౌలర్లు సమిష్టిగా రాణించి నలుగురు రెండేసి వికెట్లు తీయగా.. కెప్టెన్ మసాబా ఒక వికెట్ తీసి గినియా బ్యాటర్లను కట్టిపడేశారు.
అనంతం 78 పరుగుల చేజింగ్ తో బ్యాటింగ్ కు దిగిన ఉగాండా ఓపెనర్లు 0,1, వనడౌన్ బ్యాటర్ 1 పరుగుకే వెనుదిరగ్గా.. 6 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రిజయాత్ అలీ షా.. 33 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. హిరో ఇన్సింగ్స్ ఆడిన అలీ షా కేవలం ఒక్క బౌండరీ మాత్రమే కొట్టాడు.
మిగతావన్నీ సింగిల్స్, డబుల్స్ రూపంలో రాబట్టాడు. బౌలింగ్ పిచ్ లలో ఎలా ఆడాలో చూపించాడు. ఉగాండా బ్యాటర్లలో జిమా మియాగి 13 పరుగులతో అలీషాకు తోడుగా నిలబడటంతో ఉగాండా విజయం సాదించింది. ఉగాండా బ్యాటర్లు మ్యాచ్ లో కేవలం రెండు ఫోర్లే బాదినా 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులను ఛేజ్ చేసి టీ 20 వరల్డ్ కప్ లో బోణి కొట్టారు. ఈ విజయంతో ఉగాండా సంబరాల్లో మునిగిపోయింది.