Womens Marriage : పెళ్లితో ఒక్కటైన ఇద్దరు యువతులు

Womens Marriage

Womens Marriage

Womens Marriage : లోకంలో వింతలు విశేషాలు జరుగుతుంటాయి. వాటిని మనం వింతగా చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరికి నచ్చిన పనులు వారుచేయడం సహజమే. ఈ నేపథ్యంలో దేశంలో ఏదో ఒక చోట ఆసక్తికర విషయాలు చోటుచేసుకోవడం మామూలే. ఈ నేపథ్యంలో వారు ఇద్దరు అమ్మాయిలే. కానీ వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమకు ఎల్లలు ఉండవని నిరూపించారు.

బెంగాల్ కు చెందిన జయశ్రీ రౌల్ (28), రాఖీ దాస్ (23) డియోరియాలోని ఆర్కెస్ట్రా గ్రూపులో పనిచేస్తున్నారు. వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్లు వీరు సహజీవనం చేశారు. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలో మనం కలిసుంటే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. ఇక పెళ్లి చేసుకోవాలని భావించారు.

గత రెండేళ్లుగా వీరి మధ్య స్నేహం తారాస్థాయికి చేరింది. దీంతో వీరు వివాహం చేసుకోవాలని భావించుకున్నారు. సోమవారం స్థానిక ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. తమ వివాహాన్ని నోటరీ కూడా చేయించుకున్నారు. దీంతో చట్టబద్ధత వచ్చింది. ఇలా వారి జీవితం ఒక్కటిగా మారింది. వారి సహజీవనానికి వివాహం పునాది వేసింది.

సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అనే సూత్రాన్ని వారు విస్మరించారు. ఒకే జాతి వారైనా జీవితాంతం కలిసుందామనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. వారి జీవితం ఇక ఎలా సాగుతుందో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారాలని పెళ్లికి వచ్చిన వారు ఆశీర్వదించారు.

TAGS