NEET : నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్టు

NEET

NEET

NEET : నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ ఈరోజు (జూలై 16) మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ కేసులో బీహార్ లోని పాట్నా, జార్ఖండ్ లోని హజారీబాగ్ లకు చెందిన ఇద్దు వ్యక్తులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు.

మొదటి అనుమానితుడు ఆదిత్య అనే పంకజ్ సింగ్ హజారీబాగ్ లో పట్టుబడ్డాడు. జార్ఖండ్ లో సీల్ వేసిన ట్రంక్ పెట్టెల నుంచి ప్రశ్నాపత్రాలను తీయడంలో పంకజ్ సింగ్ ది కీలక పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. పాట్నాలో అరెస్టయిన రెండో నిందితుడు లీకైన పేపర్లను పలువురికి డిస్ట్రిబ్యూట్ చేశాడు.

నీట్ పేపర్ లీకేజీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అభ్యర్థుల ఒత్తిడితో ఈ అంశంపై కేంద్రం సీబీఐ ఎంక్వయిరీ వేసింది. ప్రస్తుతం విచారణ జరుపుతూన్న సీబీఐ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసి విచారిస్తోంది.

TAGS