JAISW News Telugu

T20 World Cup 2024 : రెండు గ్రూపులు.. 8 జట్లు..  సూపర్-8 మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారు

T20 World Cup 2024

T20 World Cup 2024

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్  క్రికెట్ 2024లో సూపర్-8 రౌండ్‌కు మొత్తం 8 జట్లు ఖరారయ్యాయి. జూన్ 1 నుంచి ప్రారంభమైన టీ20 ప్రపంచకప్‌లో అభిమానులు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను వీక్షించారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ వంటి పెద్ద జట్లు సూపర్-8 కు  అర్హత సాధించలేపోయాయి. కాగా అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రెండు జట్లు మెరుగ్గా రాణించి సూపర్-8లో చోటు దక్కించుకున్నాయి.

సూపర్-8లో ప్రతి జట్టు 3-3 మ్యాచ్‌లు  
ఇప్పటి వరకు భారత్, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి. సూపర్-8లో జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. సూపర్-8 రౌండ్‌లో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. సూపర్-8లో ఒక్కో గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

గ్రూప్-1: భారత్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్,  ఆస్ట్రేలియా
గ్రూప్-2: అమెరికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా

భారత్‌ తొలి మ్యాచ్‌ ఆఫ్ఘనిస్థాన్‌తో  
సూపర్-8లో భారత జట్టు గ్రూప్-1లో ఉంది. ఇక్కడ టీమ్ ఇండియా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో, జూన్ 22న బంగ్లాదేశ్‌తో, జూన్ 24న ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదు. గ్రూప్ దశలో న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టును ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది.

సూపర్-8లో భారత జట్టు షెడ్యూల్:
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా, జూన్ 20, బార్బడోస్
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- 22 జూన్, ఆంటిగ్వా
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా – జూన్ 24, సెయింట్ లూసియా

గ్రూప్ దశలో భారత్ 3 మ్యాచ్‌లు గెలిచింది
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. మూడో మ్యాచ్ లో అమెరికాపై  7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

టీ20 ప్రపంచ కప్ 2024 కోసం సూపర్-8 రౌండ్ పూర్తి షెడ్యూల్:
జూన్ 19: అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా, ఆంటిగ్వా
జూన్ 19: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్, సెయింట్ లూసియా
జూన్ 20: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా, బార్బడోస్
జూన్ 20: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, ఆంటిగ్వా
జూన్ 21: ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా, సెయింట్ లూసియా
జూన్ 21: అమెరికా వర్సెస్ వెస్టిండీస్, బార్బడోస్
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, ఆంటిగ్వా
జూన్ 22: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్  ఆస్ట్రేలియా, సెయింట్ విన్సెంట్
జూన్ 23: అమెరికా వర్సెస్ ఇంగ్లాండ్, బార్బడోస్
జూన్ 23: వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా, ఆంటిగ్వా
జూన్ 24: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, సెయింట్ లూసియా
జూన్ 24: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, సెయింట్ విన్సెంట్

Exit mobile version