JAISW News Telugu

Minister Narayana : డయేరియాతో ఇద్దరి మృతి.. ఘటనపై సమీక్షించిన మంత్రి నారాయణ

Minister Narayana

Minister Narayana

Minister Narayana Review : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం అంజనాపురం కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందిన ఘటనపై మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. నీరు కలుషితం కావడం కారణంగా మరణించారా..? లేక వేరే కారణాలున్నాయా..? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు మంత్రికి తెలిపారు. స్థానికంగా ఉన్న బోర్ల నీటిని విజయవాడ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపాలని మంత్రి ఆదేశించారు. అన్ని బోర్లను మూసివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో ఆరుగురు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుధ్య పనులు చేపట్టినట్లు వివరించారు.

డ్రైనేజీల్లో మురుగును తొలగించడంతో పాటు అన్ని మంచినీటి బోర్లను తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర మున్సిపాలిటీల నుంచి సిబ్బందిని రప్పించాలన్నారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్, అర్డీఎంఏ హరికృష్ణ, డీఎంహెచ్ వో రవికుమార్, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ శ్రీనివాస్, నగర పంచాయతీ కమిషనర్ అప్పారావు సమీక్షలో పాల్గొన్నారు.

Exit mobile version