Rare Pregnancy : సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చిన 9 నెలలకు బిడ్డను జన్మినిస్తుంది. ఆ తర్వాతే మరో గర్భం ధరించాల్సి వస్తుంది. అంటే కనీసం బిడ్డకు, బిడ్డకు కనీసం 9 నెలల నుంచి సంవత్సరం గ్యాప్ కచ్చితంగా వస్తుంది. దాదాపు ప్రపంచమంతా ఇదే నమ్ముతారు. ఇదే జరుగుతుంది. ఒక్కో సారి ఒకే సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు కొన్ని సార్లు అంతకంటే ఎక్కువ కూడా పుట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇది సాధ్యమే. అక్కడకక్కడ జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు చదవబోయే సంఘటన ప్రపంచంలోనే అరుదైనది అని చెప్పుకోవచ్చు. వైద్య చరిత్రలోనే ఇదొక మిరాకిల్ అనొచ్చు.
అమెరికాలోని ఓ మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆరు నెలల్లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి డాక్టర్లను సైతం అశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా ఇటీవల గర్భం దాల్చింది. తొమ్మిది నెలల తర్వాత ఒక బాబుకు జన్మనిచ్చింది. ఇలా గడిచిన మరో ఆరు నెలలకే మరో బాబుకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులే కాదు డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మొదటి బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఆమె మాములగానే ఉంది. కొంతకాలానికి ఆమె శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పాలు కూడా సరిగ్గా రాకపోవడంతో డాక్టర్ ను సంప్రదించింది. దీంతో అతడు ఆమెను పరీక్షించి గర్భం దాల్చారని చెప్పారు. లోపల పిండానికి మూడు నెలల వయసు ఉందని తెలిపారు. దీంతో జెస్సికా ఒక్కసారిగా షాక్ అయ్యింది.
ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే వారూ నమ్మలేదు. ఇలా రోజులు గడుస్తున్నా కొద్ది పిండం పెరిగింది. సరిగ్గా మొదటి కాన్పు జరిగిన ఆరు నెలలకు రెండో శిశువుకు జన్మనిచ్చింది. ఇది ఎలా జరిగింది అని అందరిలో ఒకటే ఆసక్తి నెలకొంది. అయితే దీనికి వైద్యులు వివరణ ఇచ్చారు.
వైద్య పరిభాషలో ఇలాంటి ఘటనను ‘సూపర్ ఫిటేషన్’’ అంటారు. ఒక మహిళ గర్భం దాల్చిన తొలి నెలల్లో శృంగారంలో పాల్గొనకూడదు. అలా పాల్గొనప్పుడు మరలా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. జెస్సికా కూడా గర్భం దాల్చిన తొలి నెలల్లో తన భర్తతో కలిసి శృంగారంలో పాల్గొంది. దీంతో ఆమె మరలా గర్భం దాల్చింది. దీంతో తొలి శిశువు పుట్టిన ఆరు నెలలకు మరో శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. ఐతే గర్భం దాల్చిన తొలి నెలల్లో శృంగారంలో పాల్గొనకూడదని వైద్యుల సూచిస్తున్నారు. జెస్సికా ఆరోగ్యం ఉంది కాబట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొలేదని, అందరి విషయంలో ఇలా జరగాలని ఉండదని అంటున్నారు.