JAISW News Telugu

Caravans : రెండు క్యారవాన్లు ఇస్తే గానీ ఆ హీరోలు షూటింగుకు రారు..:  సీనియర్ నిర్మాత ఆవేదన

Caravans

Caravans

caravans : నిర్మాత అంటే ఒకప్పుడు సినిమాకు బాస్. ఆయనకు పెద్ద హీరోలు, దర్శకులు కూడా గౌరవం ఇచ్చేవారు. ఇక మిగతా నటులు, సాంకేతిక నిపుణుల భయభక్తులతో ఉండేవారు. అప్పట్లో సినిమా నిర్మాత ఏది చెబితే అదే ఫైనల్ అయ్యేది. దానికి పెద్ద హీరోలు సైతం ఒప్పుకునేవారు. మొత్తానికి నిర్మాత ఏది చెబితే అదే ఫైనల్..

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నటీనటులకు సెట్స్‌లోనే అన్ని వసతులు కల్పిస్తున్నారు నిర్మాతలు. గతంలో హీరోయిన్లు చెట్లు లేదా వ్యాన్ల వెనక నిల్చొని దుస్తులు మార్చుకునేవారు.  కానీ, ఇప్పుడు అలా కాదు. పెద్ద హీరోహీరోయిన్లు తమ క్యారవాన్లు వస్తే గానీ సెట్‌లోకి అడుగుపెట్టడం లేదు. ఒక్కొక్కరూ దాదాపు ఒకటి నుంచి నాలుగు క్యారవాన్‌లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకదానిలో జిమ్‌, కిచెన్‌ కోసం ఒకటి, స్టాఫ్‌ కోసం మరొకటి ఇలా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ప్రొడ్యూసర్ల డబ్బులే.

చిత్ర నిర్మాణానికంటే హీరో హీరోయిన్లకు పై ఖర్చులకు పెట్టే డబ్బులే ఎక్కువ అవున్నాయని ఓ సీనియర్ నిర్మాత తన ఆవేదన వ్యక్తం చేశారు. వీటివల్ల నిర్మాతలపై ఎంతో భారం పడుతోందన్నారు.  క్యారవాన్‌ల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరిగే ప్రాంతంలో ఒక మినీ బస్టాండ్ లాగా ఉంటుంది. ఆ క్యారవాన్ నుంచి ఫ్లోర్ లోకి రావడానికి హీరో చుట్టూ ఓ పది మంది బౌన్సర్లు ఉండాలి. ఏం కిడ్నాప్ చేస్తారా ఆయనను.. అలా ఎందుకు అది ఎచ్చులా.  అదంతా ప్రొడ్యూసర్ ఖర్చే. అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version