Two Captains : ఒకే క్రికెట్ మ్యాచ్ లో ఇద్దరు కెప్టెన్లకు జరిమానా విధించారు. నిన్నజరిగిన చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. దీంతో ఇరు జట్ల కెప్టెన్లకు బీసీసీఐ రూ.12 లక్షల చొప్పున ఫైన్ విధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. లక్నో కెప్టెన్ గా రాహుల్, చెన్నై కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్నారు.
ఈ మ్యాచ్ లో చెన్నై పై 8 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండానే లక్నో ఛేదించింది. కేఎల్ రాహుల్ 82, డికాక్ 54 రాణించగా, ముస్తాఫిజుర్, పతిరణ చెరో వికెట్ తీశారు. చెన్నై జట్టులో జడేజా 57, రహానే36, అలీ 30, ధోనీ 28 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, స్టొయినిస్, బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.