JAISW News Telugu

Rameswaram Cafe : రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ట్విస్ట్, సీసీటీవీ కెమెరాల్లో, పట్టుకున్న పోలీసులు!

Rameswaram Cafe

Rameswaram Cafe

Rameswaram Cafe : రుచికరమైన దక్షిణ భారత వంటకాలను రుచి చూడటానికి ‘ది రామేశ్వరం కేఫ్’ ముందు ప్రతి రోజు ప్రజలు క్యూ కడుతున్నారు. అలంటి రామే శ్వరం కేఫ్‌లో శుక్రవారం మద్యాహ్నం బాంబు పేలు డు జరగడంతో పోలీసులు బాంబును అమర్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలి సిం ది. రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరగడం తో బెంగళూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు.

బెంగళూరు నగరంలోని మారతహళ్లి- వైట్ ఫీల్డ్ సమీపంలోని కుందనహళ్లిలోని రామేశ్వర్ కేఫ్‌లో మార్చి 1వ తేదీ శుక్రవారం మద్యాహ్నం బాంబును అమర్చిన నిందితుడిని బెంగళూరు సీసీబీ పోలీసు లు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచా రిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవా రం మధ్యాహ్నం 12.55 గంటల ప్రాంతంలో రామే శ్వరం కేఫ్‌లో ఉంచిన బ్యాగ్‌లో ఉన్న రెండు తేలిక పాటి బాంబులు పేలడంతో ప్రజల్లో భయాందో ళన లు నెలకొన్నాయి.

ఈ బాంబు పేలుడులో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 9 మంది గాయపడగా వారిలో స్వర్ణాంబ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటన జరిగిన తర్వాత బెంగళూరు పోలీసులు, ఎఫ్‌ఎస్‌ ఎల్‌ నిపుణులు, నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం స్క్వాడ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీజ్ చేసిన హోటల్, పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో బాంబు అమర్చిన వ్యక్తి ముఖం, అతని ఆనవాళ్లు లభ్యమైనాయి.

నిందితుడిని అరెస్టు చేసే బాధ్యతను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. నిందితు డిని కనుగొనడానికి సీసీబీ అధికారుల 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబం ధించి నిందితుడు బెంగళూరు వదిలిపారిపోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిరంత ర సోదాల అనంతరం నిందితుడి ఆచూకీ లభించ డంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకు ని విచారించినట్లు సమాచారం.

Exit mobile version