KTR Vs Siddaramaih:కేటీఆర్, సీఎం సిద్ధరామయ్యల ట్విట్టర్ వార్
KTR Vs Siddaramaih:కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తెలంగాణ మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం మాటల యుద్ధం మొదలైంది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. `ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి.. అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు` అంటూ కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఈ వీడియోపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి రానుందని, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ సదరు వీడియోని రీట్వీట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినా ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన ఉండాలిగా అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
`కేటీఆర్ మీరు తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసా?.. కనీసం మీకు నిజమేంటో..నకిలీ ఎడిటెడ్ ట్వీట్ ఏంటో తెలియదు అందుకే ఓడిపోయారు. ఇలాంటి ఫేక్, ఎడిటెడ్ వీడియోలను బీజేపీ సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వాటిని సర్క్యూలేట్ చేస్తోంది` అంటూ సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ వైరల్‌గా మారింది.
No money to deliver poll promises/guarantees says Karnataka CM !
Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ?
Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq
— KTR (@KTRBRS) December 19, 2023
Mr. @KTRBRS, Do you know why your party lost in the Telangana Elections?
Because you don't even know how to verify what is fake and edited, and what is truth. @BJP4India creates fake edited videos, and your party circulates them. Yours is a perfect B Team of BJP.
If you are… https://t.co/Ey5y9K3fLd
— Siddaramaiah (@siddaramaiah) December 19, 2023