Tushar Deshpande : ఆర్సీబీ పై తుషార్ దేశ్ పాండే కామెంట్స్ వైరల్ గా మారాయి. బెంగళూరు కాంట్ అని ఇన్ స్టాలో పోస్టు చేసి వెంటనే డిలీట్ చేశాడు. తుషార్ దేశ్ పాండే కామెంట్స్ వైరల్ గా మారడంతో ఆర్సీబీ అభిమానులు రెచ్చిపోయారు. తుషార్ పై కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
ఎప్పటికీ ఆర్సీబీ కప్ గెలవదనే అర్థం వచ్చేలా పెట్టడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆర్సీబీ ప్లే ఆప్స్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదటి బెంగళూరకు బ్యాటింగ్ అప్పగించింది. అహ్మదాబాద్ లోని పిచ్ మొదట బౌలింగ్ కు అనుకూలించడంతో రాజస్థాన్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరాట్, డుప్లెసిస్ ను కట్టడి చేశారు.
రాజస్థాన్ రాయల్స్ 173 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్సింగ్స్ ప్రారంభించగా.. యశస్వి జైశ్వాల్ 30 బంతుల్లోనే 45 పరుగులతో రాణించగా.. బెంగళూరుపై మెరుపు విజయం సాధించారు. చివర్లో ఇంషాక్ట్ ప్లేయర్ గా వచ్చినా.. హిట్ మెయిర్ 30 పరుగులతో రాణించి మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించడంతో ఎలిమినేటర్ 2 కు క్వాలిఫై అయింది.
డుప్లెసిస్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. స్లో పిచ్ లో 180 టార్గెట్ అయితే సరిపోతుందనుకున్నాం. కానీ మేం చేసిన 172 పరుగులు సరిపోలేదు. ఇంకో 20 పరుగులు చేస్తే విజయం మా వైపు ఉండేది. కానీ వరుసగా ఆరు మ్యాచులు ఓడిపోయి.. మళ్లీ ఆరు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆప్స్ కు రావడం అంటే మామూలు విషయం కాదు. ఆర్సీబీ బాయ్స్ ను చూస్తే గర్వంగా ఉంది. కానీ ఈ మ్యాచ్ గెలవాల్సింది. పిచ్ కండిషన్స్ ప్రకారం.. డ్యూ ఎక్కువగా ఉండటంతో రెండో ఇన్సింగ్స్ లో బౌలింగ్ చేయడం కష్టమైంది. అయినా మా బౌలర్లు చాలా మేరకు రాణించారు.