Tunnel Roads in Hyderabad : హైదరాబాద్ లో టన్నెల్ రోడ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..
Tunnel Roads in Hyderabad : హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు మనకు తెలిసిందే. కొన్ని రూట్లలో ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే గంటల సమయం తీసుకుంటుంది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు టన్నెల్ రోడ్లు నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈమేరకు జీహెచ్ ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగరంలోని ఐదు ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో దాదాపు 39 కి.మీ. మేర సొరంగ టన్నెల్ రోడ్ల నిర్మాణానికి నివేదిక రూపొందించేందుకు నిర్ణయించారు. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు టెండర్లు పిలిచారు.
– ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు వయా ఖాజాగూడ, నానక్ రాం గూడ వరకు 9 కి.మీ.
– ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్టీయూ వరకు వయా మైండ్ స్పేస్ జంక్షన్ 8 కి.మీ.
– ఐటీసీ కోహినూర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వయా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 వరకు 7 కి.మీ.
– జీవీకే మాల్ నుంచి నానల్ నగర్ వయా మాసబ్ ట్యాంక్ 6 కి.మీ.
– నాంపల్లి నుంచి చాంద్రాయణ గుట్ట ఇన్నర్ రింగ్ రోడ్డు వయా చార్మినార్, ఫలక్ నుమా 9 కి.మీ.
ఈ టన్నెల్ ఏర్పాట్ల ద్వారా నగరంలోని ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. టెండర్ల ప్రక్రియ, టన్నెల్స్ నిర్మాణం పూర్తి కావడానికి రెండు మూడు ఏండ్ల సమయం పట్టనుంది.