JAISW News Telugu

TTD Good News : సీనియర్ సిటిజన్స్ కు TTD శుభవార్త 

TTD Good News

TTD Good News

TTD Good News : తిరుపతి వెంకటేశ్వర స్వామి తనవద్దకు వచ్చే భక్తుల అందరిని సమానంగానే చూస్తాడు. ప్రతి ఒక్కరికి తన దర్శన భాగ్యం ఉంటుంది. ఆదే విదంగా వయో వృద్దులకు వెంకన్న స్వామి కొంత వెసులుబాటు ఇచ్చారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లు పరిపాలించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కనికరించలేదు. దేవుడు వరమిచ్చినా, పూజారి కనికరించలేదు అనే సామెత పక్కా ఏపీ వైసీపీ ప్రభుత్వానికి సరిపోతుంది. సీనియర్ సిటిజన్స్ మీద ఏమి కోపం వచ్చిందో తెలియదు. కానీ వాళ్లకు వెంకన్న సన్నిధిలో ఉన్న సౌకర్యాలను ఎత్తివేస్తూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ దర్శనం కోసం అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. 

 

తాజగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం  అధికారంలోకి వచ్చింది. ఈ సమస్య కాస్త ఆయన దృష్టికి చేరింది. వెంటనే ఆయన సీనియర్ సిటిజెన్ లకు గతంలో ఉన్న సౌకర్యాలను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో సీనియర్ సిటిజెన్ లతో పాటు వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.  

 

వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం రోజుకు రెండు సార్లు సమయం కేటాయించారు. ఒకటి ఉదయం పది గంటలకు. మరొకటి మధ్యాహ్నం మూడు గంటలకు. ఈ రెండింటిలో ఏదయినా ఒక సమయాన్ని ఎంచుకొని సమయాన్ని బుకింగ్ చేసుకోవాలి. వెంట వయసు నిర్దారణ సర్టిఫికెట్ తోపాటు ఫోటో, ఆధార్ కార్డు వెంట తీసుకొని ఎస్ 1 కౌంటర్లో అందజేయాలి. ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకున్న సీనియర్ సిటిజెన్ లు రూ20/- చెల్లించి రెండు లడ్డూలను పొందవచ్చు. 

 

అదనంగా లడ్డూలు కావాలంటే ఒక్క లడ్డు కు ఇరువై ఐదు రూపాయలు చెల్లించి కూడా తీసుకునే అవకాశం కొత్త ప్రభుత్వం కల్పించింది. బ్యాటరీ కారు కూడా అందుబాటులో ఉంది. సీనియర్ సిటిజన్ లు దర్శనం చేసుకునే సమయంలో మిగతా భక్తులను నిలిపివేస్తారు. కేవలం వాళ్ళను మాత్రమే అనుమతిస్తారు. ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చని చంద్రబాబు ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం 08772277777 నంబర్ తో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.

Exit mobile version