TTD Tickets : నేడు ఆ కోటాలో టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఎలా బుక్ చేసుకోవాలంటే?

TTD Tickets

TTD Tickets

TTD Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు నిత్యం కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటాయి. అయితే శ్రీవారి దర్శనం అంత సులువుగా దొరకదు. ఒకప్పుడు కాలినడకన, సెల్లార్ దర్శనం కల్పించేవారు ఆ దేవదేవుడు. కానీ రోజు రోజుకు రద్దీ పెరుగుతుండడంతో బోర్డు రూ.300 తో ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేసింది. ఈ దర్శనం కూడా ఇప్పుడు మహా భాగ్యంగా మారుతోంది. ఎందుకంటే ఈ దర్శనానికి సంబంధించిన టికెట్లు ఎప్పటికప్పుడు అమ్ముడుపోతున్నాయి. దీంతో మూడు నెలల ముందు నుంచే రూ.300 టికెట్లకు డిమాండ్ పెరుగుతోంది. సెప్టెంబర్ కోటాకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది.

తిరుమలకు వెళ్లాలనుకునేవారు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా దర్శనం, వసతి చేసుకోవడం ముఖ్యం. దర్శనంతో పాటు గదులు దొరకడం కష్టంగా మారుతోంది. ఇక్కడికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీటీడీ బోర్డు 3 నెలల ముందు ముందు నుంచే టికెట్లను రిలీజ్ చేస్తుంది. ఇవి రిలీజ్ అయిన కొద్ది సమయానికే బుక్ అయిపోతున్నాయి. విద్యా సంస్థలకు సెలవుల సందర్భంగా మార్చి నుంచి జూన్ వరకు కోట్లాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సెప్టెంబరులో వెళ్లాలనుకునే వారికి టీటీడీ ఇప్పుడు టికెట్లను రిలీజ్ చేయనుంది.

జూన్, 24 సోమవారం టీటీడీకి సంబంధించి టికెట్లను రిలీజ్ చేయనుంది. ఇందులో రూ.300 ప్రత్యేక దర్శనం సంబంధించినవి ఉన్నాయి. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లకు డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని 3 నెలల ముందు నుంచే విక్రయిస్తున్నారు. వీటితో పాటు గదుల కోసం టికెట్లను రిలీజ్ చేయనున్నారు. వీటిని మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారు. వీటితో పాటు స్వామి వారి సేవా కోట కింద టికెట్లను జూన్ 27న రిలీజ్ చేస్తారు. 

TAGS