Dinesh Ramachandra : అయోధ్యలో టీటీడీ విధానాలు.. దినేశ్ రామచంద్ర

Dinesh Ramachandra
Dinesh Ramachandra : అయోధ్యలో టీటీడీ తరహా పరిపాలనా విధానాలు, భక్తుల రద్దీ నియంత్రణ పద్ధతులు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు దినేశ్ రామచంద్ర తెలిపారు. తిరుమల శ్రీవారిని అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు దినేశ్ రామచంద్ర సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం బయట మీడియాతో ఆయన మాట్లాడారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అయోధ్యలో ఇప్పటికే పర్యటించారని, టీటీడీ పరిపాలనా విధానాలపై పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించామని చెప్పారు.
టీటీడీ అమలు చేస్తున్న దర్శనం, వసతి, అన్నప్రసాదాల వితరణ వంటి కార్యక్రమాలను అయోధ్యలోనూ అనుసరించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ప్రస్తుతం అయోధ్యలో రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకుంటున్నారని, రద్దీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.