High Court order : టీటీడీ కార్యాలయంపై దాడి కేసు.. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలకు హైకోర్డు ఆదేశం
High Court order : మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన ధర్మాసనం అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలను హైకోర్టు ఆదేశించింది. ప్రధాన బెయిల్ పై విచారణ ఈ నెల 25కు వాయిదాపడింది.
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను 120వ నిందితుడిగా చేర్చారని సజ్జల పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారు. అదే క్రమంలో తనపై కూడా కేసు పెట్టారని, సీఆర్పీసీ సక్షన్ 41ఏ నోటీసు నిబంధనల ప్రకారం తాను రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే హత్యాయత్నం సెక్షన్ ను చేర్చారని పేర్కొన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. ముందస్తు బెయిలు మంజూరు చేయండని పిటిషన్ లో సజ్జల కోరారు.