TTD Complaint : ఏఆర్ డెయిరీపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

TTD Complaint

TTD Complaint

TTD complaint : తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిన ఘటన సంచలనం కలిగించగా దానిపై టీటీడీ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్ లో ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు.

ఈ ఏడాది మే 15న నెయ్యి సరఫరాకు ఆర్డర్ ఇవ్వగా, జూన్ 12, 20, 25 తేదీలతో పాటు జులై 6, 12న 4 ట్యాంకర్ల నెయ్యి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిందని వివరించారు. ఏఆర్ డెయిరీ సప్లై చేసిన నెయ్యిని ఎన్ డీబీఎల్ సహకారంతో అడల్టరేషన్ టెస్టింగ్ నిర్వహించామన్నారు. నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్టు రిపోర్టు వచ్చిందన్నారు.  జులై 22, 23, 27 తేదీల్లో ఏఆర్ డెయిరీకి షోకాజ్ నోటీసులు జారీ చేశామని టీటీడీ వెల్లడించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సెప్టెంబరు 4న ఏఆర్ డెయిరీ సమాధానం ఇచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కల్తీకి పాల్పడిన ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని బుధవారం టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు.

TAGS