![TTD Chairman BR Naidu and Pathuri Nagabhushan met Deputy CM Pawan](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2024/11/13103849/WhatsApp-Image-2024-11-13-at-9.15.36-AM.jpeg)
TTD Chairman BR Naidu and Pathuri Nagabhushan met Deputy CM Pawan
AP Deputy CM Pawan Kalyan : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు శ్రీవారి ప్రసాదం అందజేశారు. తాజాగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం చైర్మన్‌తో పాటు 24 మందిని నియమించింది. తాజాగా చైర్మన్‌తో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ నాయుడును ప్రత్యేకంగా అభినందించారు.
Pathuri Nagabhushan met Deputy CM Pawan
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చైర్మన్ తో పాటు సభ్యులు సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని కొణిదల పవన్ కళ్యాణ్ సూచించారు. బీఆర్ నాయుడుతోపాటు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో టీటీడీ పాలక మండలి సభ్యులు ఆనందసాయి, బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం కూడా ఉన్నారు.. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కు బొకే అందజేసి, దేశవాళీ ఆవునెయ్యిని బహుకరించారు. అంతకు ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరూ కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తిరుమలలో పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి సూచించారు.