TSRTC:తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీలో ప్రయాణం ఉచితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిదే. అయితే చాలా వరకు కొన్ని చోట్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ చేయడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇప్పటికే కొంత మంది ఆటో డ్రైవర్లు రోడ్లెక్కారు.
ఇదిలా ఉంటే మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లెవెలుగు బస్సులను వినియోగించుకోవాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కుతుండటంతో ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మహిళా ప్రయాణికులకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
`మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది.
ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది` అంటూ విజ్ఞప్తి చేశారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి… pic.twitter.com/bJryVNNxkM
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 23, 2023