TSPSC Group 2 Exam : తెలంగాణ గ్రూప్‌-2 ఎగ్జామ్‌ వాయిదా ? త్వరలో ప్రకటన?

TSPSC Group 2 Exam

TSPSC Group 2 Exam

TSPSC Group 2 Exam : తెలంగాణలో ఉద్యోగాల రాత పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలకు మధ్య వారం మాత్రమే ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్‌లు నిరుద్యోగులకు ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు భరోసా ఇచ్చారు. తాజాగా గురువారం (జూలై 18) బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిరుద్యోగులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య చాలా తక్కువ సమయం ఉందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. టీజీ డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు మే, జూన్ నెలల్లో నిర్వహించాల్సి ఉందని, అభ్యర్థుల డిమాండ్ మేరకు డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించామని బలమూరి వెంకట్ తెలిపారు.

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ పరీక్ష తేదీలు ముందే చెప్పామని, ఇప్పుడు డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వారం రోజుల్లో వచ్చాయన్నారు. ఈ విషయంలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ అని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రూప్-2 వాయిదా వేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల సచివాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించడంతో తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల అసంతృప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను ఎప్పుడైనా వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే పరిస్థితి ఒకటి రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.

గ్రూప్-2 పరీక్ష వాయిదా పడితే.. మళ్లీ నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు గ్రూప్-2 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. అలాగే… టీజీపీఎస్సీ గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని నిరుద్యోగుల డిమాండ్. గ్రూప్-2 పోస్టులను 783 నుంచి 2000 పోస్టులకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-3 పోస్టులను 3000కు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

TAGS