TS RTC : భాగ్యనగర వాసులకు తెలంగాణ ఆర్‌టిసి అధికా రులు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవటం ఉత్తమ మ ని అధికారులు అంటున్నారు. ఎందుకంటే, ఆ నా లుగు రోజులు నగరంలో సిటీ బస్సుల సంఖ్య తగ్గ నుంది.
కాబట్టి బస్సు ప్రయాణం చేసేవారు వారి ప్రయా ణాలను వాయిదా వేసుకోవడమో లేక, ఇతర మార్గాలను చూసుకోవటమో చేయాలి. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకో సం సుమారు 2వేల బస్సులను కేటాయించారు. దీంతో ఆ నాలుగురోజుల పాటు ఇతర ప్రయాణి కుల బస్సుల సంఖ్య తగ్గిపోయింది.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో సుమారు రెండు వేల బస్సులు మేడారం జాతరకు వెళ్లనున్నాయి. దీంతో భాగ్యనగర ప్రయాణికుల కోసం కేవలం 850 బస్సులు మాత్ర మే అందుబాటులో ఉండనున్నా యి.
ఇందులో 250 బస్సులు సిటీ నుంచి బయలుదేరు తున్నా యి. మిగిలిన బస్సులు రాష్ర్టంలోని వివిధ ప్రాం తాలకు వెళ్లనున్నాయి. ఆ నాలుగు రోజుల్లో పను లు పెట్టుకుని ఆటోలు, క్యాబ్‌ల దోపిడీకి గురి కావొ ద్దనే ఉద్దేశంతో టిఎస్ ఆర్‌టిసి అధికా రులు ప్రయా ణికులను హెచ్చరిస్తున్నారు.