JAISW News Telugu

TS Budget 2024 : తెలంగాణ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు.. ఆ హామీలకే పెద్దపీట..నిధుల కేటాయింపులు ఇలా..

TS Budget 2024

TS Budget 2024, Bhatti Vikramarkka

TS Budget 2024 : తెలంగాణ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ను రూపొందించారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వం తన తొలి బడ్జెట్ ను ప్రతిపాదించింది.

ఈ సందర్భంగా భట్టి ప్రసంగిస్తూ.. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. సామాజిక, ఆర్థిక , రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను ప్రతిపాదించినట్టు చెప్పారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలు దిబ్బ అన్నట్లుగా ఐటఉండేవన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి సంతులిత అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు.

శాఖలవారీగా కేటాయింపులు ఇవి..

ఆరు గ్యారెంటీలు: రూ.53,196 కోట్లు
వ్యవసాయం : రూ.19,746 కోట్లు
ఐటీ శాఖ : రూ.774 కోట్లు
పురపాలక శాఖ: రూ.11,692 కోట్లు
విద్యా రంగం : రూ.21,389 కోట్లు
మూసీ ప్రాజెక్టు  : రూ.1,000 కోట్లు
వైద్య రంగం : రూ. 11,500 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖ : రూ.21,874 కోట్లు
గృహనిర్మాణం : రూ.7,740 కోట్లు
మైనారిటీ సంక్షేమం : రూ.2,262 కోట్లు

ఆర్థిక మంత్రి ప్రసంగం ముఖ్యాంశాలు..

-త్వరలోనే 15వేల కానిస్టేబుళ్ల నియామకం పూర్తి.
-త్వరలోనే మెగా డీఎస్సీ
– టీఎస్సీపీఎస్సీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకానికి రూ. 40 కోట్లు
-గిగ్ వర్కర్ల సామాజిక భద్రత స్కీమ్ కింద రూ.5లక్షల ప్రమాద బీమా
-దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్ వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం.
-పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ మరింత అభివృద్ధి.
– గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్
– త్వరలోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్.

Exit mobile version