Pattabhiram : తిరుమల కల్తీ నెయ్యి అంశంలో నిజాలు బయటపడుతున్నాయి: పట్టాభిరామ్

Pattabhiram
Pattabhiram : జగన్ పాలనలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తెలిపారు. ఆ సంస్థ నెలకు కేవలం 16 టన్నుల నెయ్యిని మాత్రమే ఉత్పత్తి చేస్తుందని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నులు ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.
శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డెయిరీని అడ్డుపెట్టుకున్నారని ఆధారాలు నిరూపిస్తున్నాయని పట్టాభి ధ్వజమెత్తారు. ‘సత్యమేవ జయతే’ అని చెప్పే జగన్ తాము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలరా..? అని ప్రశ్నించారు. రూ.39 కోట్ల నెయ్యి కాంట్రాక్టులో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్లకు మద్దతు పలికే అధికారులు పాపాలు చేశారని పట్టాభి ఆరోపించారు.