Trump : టారిఫ్ లపై ట్రంప్ సంచలనం.. చైనాకు మాత్రం గట్టి షాక్

Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్నారు. చైనా మినహా మిగతా 70 దేశాలపై అమలులో ఉన్న ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, చైనాపై టారిఫ్‌లను ఉన్నదానికంటే 125%కి పెంచుతున్నట్టు తెలిపారు. ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ “చైనా ప్రపంచ మార్కెట్ల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది,” అని చెప్పారు.
ఇదిలా ఉండగా, అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై చైనా ఇప్పటికే 84% టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశముంది.