JAISW News Telugu

Trump : సోషల్ మీడియాలో ట్రంప్ డ్యాన్స్ వైరల్

FacebookXLinkedinWhatsapp
Trump

Trump

Trump Dance : అమెరికా 2024 ఎన్నికల్లో విజేతగా నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆన్ లైన్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. క్రీడాకారులు, సెలబ్రిటీలు ఆయన డ్యాన్స్ ను అనుకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఫుట్ బాల్, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో విజేతలు కూడా సంబరాలు చేసుకుంటున్న వేళ ఈ డ్యాన్స్ చేసి అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు.

ఇటీవల న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరిగిన యూఎఫ్ సీ-309 మ్యాచ్ ను వీక్షించేందుకు ట్రంప్ హాజరయ్యారు. ఆయనతో పాటు యూఎఫ్ సీ సీఈవో డానా వైట్, ఎలాన్ మస్క్, ఆర్కేఎఫ్ జూనియర్ వంటి వారున్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జాన్ జానెస్ కూడా సంబరాల వేళ ట్రంప్ డ్యాన్స్ చేశాడు. అమెరికాలోని ప్రొఫెషనల్, యూనివర్సిటీ స్థాయి ఫుట్ బాల్ మ్యాచ్ ల్లో కూడా ఆటగాళ్లు ఈ స్టెప్పులు వేస్తున్నారు. ట్రంప్ బృందం కూడా ఇలాంటి వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

Exit mobile version