ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని ఇతర ప్రాంతాల్లో మస్క్ తో కలిసి ప్రచారం చేసిన డొనాల్డ్ ట్రంప్ దేశానికి మస్క్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ‘మనలో చాలా మంది లేనందున అమెరికా మన మేధావులను రక్షించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ పాత్రపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈ ప్రశంసలు వెల్లువెత్తాయి. మస్క్ ‘కాస్ట్ కటింగ్ సెక్రటరీ’గా వ్యవహరించవచ్చని ట్రంప్ సూచించినప్పటికీ, మస్క్ క్యాబినెట్ పదవిలో ఉండరని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా మీడియా అంచనాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన 270 ఎలక్ట్రోరల్ ఓట్లకు చేరువలో ఉన్నారు. రిపబ్లిక్, డెమొక్రాటిక్ కు నెక్ టు నెక్ వచ్చిన రాష్ట్రాలు నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియాలో సాధించిన కీలక విజయాలు ఆయన విజయానికి బాటలు వేసి, వైట్ హౌజ్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సహకరించాయి.
అధికారిక ఫలితాలు పెండింగ్ లో ఉన్నప్పటికీ, కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయంపై ఆయన మద్దతుదారులు ర్యాలీ చేయడంతో అంతిమ విజయం దక్కింది.