Trump : ట్రంప్ H-1b విజన్: టాప్ టాలెంట్ కే ప్రాధాన్యం ఉంటుందా..?

Trump

Trump

Trump : H-1b వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి అవలంభించారు. ఎక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలకు అర్హత సాధించి అత్యధిక నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో ఇతరులకు ప్రవేశం పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విస్తృత అర్హత ప్రమాణాలకు భిన్నంగా అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల  నుంచి ఉద్యోగాలు కోరుకునే అగ్రశ్రేణి విద్యార్థులకు H-1b వీసాలు మంజూరు చేయడంపై ఆయన దృష్టి సారించారు. లేదంటే ఆన్ సైట్ కు వచ్చే ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లించేందుకు తగిన నైపుణ్యం ఉండాలి.

అమెరికాలో H-1b వీసా పొందేందుకు అవసరమైన అర్హతలను మరింత కుదించేలా ‘స్పెషాలిటీ ఆక్యుపేషన్’ కేటగిరీలో మార్పులతో సహా పలు సవరణలను ట్రంప్ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. యూనివర్సిటీలు, ఆర్థిక అభివృద్ధి బృందాలతో సహా 74 సంస్థలు ‘ప్రత్యేక వృత్తి’ అనే ట్రంప్ నిర్బంధ వివరణను అధికారికంగా వ్యతిరేకించినప్పటికీ, 2025, జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అమలు చేసేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారు.

నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. కంప్యూటర్ వృత్తుల్లో 51 శాతం మంది యూఎస్ ప్రొఫెషనల్స్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీలను కలిగి ఉండరు. ఇది కఠినమైన డిగ్రీ అవసరాలను పరిమితం చేస్తుంది. ఆచరణ సాధ్యం కాదు. ఉదాహరణకు ఏదైనా సాఫ్ట్ వేర్ వర్టికల్ లో శిక్షణ పొందిన నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కు H-1b రాకపోవచ్చు.

ట్రంపునకు మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్ వంటి టెక్ లీడర్లు సాధారణంగా హై స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ కు అనుకూలంగా ఉన్నారు. ఇది ట్రంప్ నిర్బంధం వల్ల చర్యలను అమలు చేస్తే విధానపరమైన ఘర్షణకు దారి తీస్తుంది. H-4 వీసాదారులకు (H-1b వీసాదారుల జీవిత భాగస్వాములకు) ఉద్యోగ అర్హతను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు H-1b వీసాపై ఉన్న వారి జీవిత భాగస్వాముల మధ్య ఈ అంశంపై ఉద్రిక్తతను తీసుకువస్తుంది.

H-1b నిపుణులకు మార్కెట్ సగటు కంటే 40 నుంచి 100 శాతం అధిక వేతనాలు అవసరమని ట్రంప్ కార్మిక శాఖ ప్రతిపాదించింది. అనేక సందర్భాల్లో, యజమానులు నైపుణ్య స్థాయితో సంబంధం లేకుండా H-1b కార్మికులకు సంవత్సరానికి కనీసం 208,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంఖ్య అనేక స్థానాల నియామకం ఖరీదైనదిగా మారింది.

ట్రంప్ విధానాలు 2019 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి H -1b పిటిషన్లకు ఆర్ఎఫ్ఈ (రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్) రేట్లను 60 శాతానికి పెంచాయి. ప్రతీ కేసుకు లీగల్ ఫీజును 2,000–4,500 డాలర్లకు పెంచాయి. దీన్ని మరింత పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పెరిగిన డాక్యుమెంటేషన్ అవసరాలు, H-1b ఉద్యోగులకు అధిక వేతన నిబంధనలు ఖర్చులను పెంచాయి. విదేశాలలో జన్మించిన ప్రతిభావంతులను నియమించకుండా యజమానులను నిరుత్సాహపరిచాయి. వీటిని ఎలా అమలు చేస్తారో, దాని ఫలాలను అమెరికా ఎంత వరకు సానుకూలంగా చూస్తుందో చూడాలి.

TAGS