Trump : ట్రంప్ ఘన విజయం.. ఇరాన్ కరెన్సీ భారీ పతనం

Trump
Trump Victory : అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని సాధించడంతో ఇరాన్ అర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపించింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవడంతో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ తగ్గిపోయింది. బుధవారం రోజున ఇరాన్ కరెన్సీ రియాల్ యూఎస్ డాలరుతో పోలిస్తే 7,03,000 స్థాయికి పడిపోయింది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి.
2015లో ఒక డాలర్ కు 32,000 రియాల్ ఉండగా, ఇప్పుడు ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈ విలువ మరింత పడిపోయింది. మీడియా కథనాల ప్రకారం, అమెరికా ఎన్నికల ఫలితాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని వివరించింది.