JAISW News Telugu

Anupama Parameswaran : నిజమే.. ఆ హీరో ని నేను ప్రేమిస్తున్నాను : అనుపమ పరమేశ్వరన్!

FacebookXLinkedinWhatsapp
Anupama Parameswaran

Anupama Parameswaran

Anupama Parameswaran : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అనుపమ పరమేశ్వరన్ నెంబర్ 1 స్థానం లో ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కేరళ సోయగం అందచందాలకు కుర్రాళ్లు ఆ రేంజ్ లో ఫిదా అయ్యారు. కెరీర్ పరంగా ఈమెకి టాలీవుడ్ లో పెద్ద సూపర్ హిట్ సినిమాలు చేతివేళ్ళతో లెక్కపెట్టొచ్చు. స్టార్ హీరోలతో నటించే అవకాశం కూడా ఈమెకి దక్కలేదు.

అయినప్పటికీ ఇంత క్రేజ్ ఉంది అంటే కచ్చితంగా ఆమె అందం, అభినయం అలాంటిది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘అఆ’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఇందులో ఈమె పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో కనిపించింది. తొలిసినిమాతోనే నెగటివ్ రోల్ లో కనిపించిన ఒక అమ్మాయి, తర్వాతి సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ చేసి పైకి రావడం చాలా కష్టం. ఇది పాయల్ రాజ్ పుత్ విషయం లో మనం చూసాం.

కానీ అనుపమ పరమేశ్వరన్ విషయం లో మాత్రం అలా జరగలేదు. ఇప్పటి వరకు ఈమె హీరోయిన్ గా చేసిన చిత్రాలలో  ‘శతమానం భవతి’, ‘రాక్షసుడు’ మరియు ‘కార్తికేయ 2’ వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈమె రవితేజ హీరో గా నటించిన ‘ఈగల్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఫిబ్రవరి 9 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాతో పాటుగా ఆమె డీజే టిల్లు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఇన్ని రోజులు నటనకి ప్రాధాన్యత ఇచ్చిన పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆమె ఈ సినిమాలో కుర్రాళ్లను మత్తెకించే అందాలతో అలరించబోతుంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ , మరియు వీడియో కంటెంట్ చూస్తే అనుపమ పరమేశ్వరన్ ఏ రేంజ్ లో రేచిపోయిందో అర్థం అవుతుంది.

ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ‘హీరోలలో మీ క్రష్ ఎవరు’ అని అడగగా, దానికి అనుపమ పరమేశ్వరన్ సమాధానం చెప్తూ ‘రీసెంట్ గా అయితే నేను పుష్ప సినిమాకి బాగా కనెక్ట్ అయ్యాను. అల్లు అర్జున్ తెగ నచ్చేసాడు. నాకు ప్రస్తుతం అల్లు అర్జునే క్రష్. ఆయనే నా ఫేవరెట్ హీరో కూడా’ అంటూ చెప్పుకొచ్చింది. గతం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకొని తిరిగిన అనుపమ, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పుకోవడం పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Exit mobile version