JAISW News Telugu

Trolls on Jagan : వైఎస్ జగన్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్

Trolls on Jagan

Trolls on Jagan

Trolls on Jagan : ‘‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’’..‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి..’’ లాంటివి మన తెలుగునాట రివేంజ్ కు సంబంధించిన సామెతలు. ఎవరికీ ఎలా చెబితే అర్థం అవుతుందో అలానే చెప్పాలి..అంటే వారి భాషలోనే వారికి సమాధానం చెప్పాలి. కరుకు వ్యక్తికి కరుకుగానే చెప్పాలి..దురుసు వ్యక్తికి దురుసుగానే చెప్పాలి. సాఫ్ట్ గా చెబుతామంటే వినే రకాలు కదా. అలాంటి వాడే వైసీపీ అధినేత జగన్ అండ్ కో.

అధికారంలో ఉన్నప్పుడు నానా వాగుడు వాగారు. అహంకారంతో ప్రతిపక్షనేతలను గేలి చేశారు. ఎగతాళి చేశారు. కేవలం ఒక ఎన్నికలో గెలిచి ఏదో తమకు తాము రాజకీయ చాణక్యుడిగా, ప్రజానేతగా కీర్తించుకున్నారు. అనుకోని విజయం సాధించి..అభివృద్ధి అంటే తెలియక..ఏవో రెండు సంక్షేమ పథకాలు అందించి వాటినే పాలన అనుకుని..వాటితోనే జనాలు గొర్రెల్లాగా తమకు ఓట్లు వేస్తారని కలలు కన్నారు. కానీ ప్రజల్లో ఎంత చైతన్యం ఉందో..వారెంతా తెలివిగలవారో ఈ కురుచబుద్ధి జగన్ కు అర్థం కాలేదు. అందుకే మహామహానేతలు సైతం ప్రజలను గౌరవించేవారు. ప్రజలను తక్కువగా అంచనా వేసిన ఏ ఒక్క నాయకుడు రాజకీయాల్లో మనుగడ సాగించలేదు ఇప్పటివరకు.

మేం పాలకులం అన్న దర్పం చూపిస్తే..పోలింగ్ బూత్ ల్లో ప్రజలు తమ తడఖా చూపిస్తారు. నేడు అదే జరిగింది. ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపక్షనేతలు చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై జగన్ అండ్ కో చేసిన అవమానాలను ఎవరూ మరిచిపోలేరు. చంద్రబాబును వృద్ధుడంటూ, వెన్నుపోటు దారుడంటూ చేసిన ట్రోల్స్ ను చూసి జనం గుండెలు చివుక్కుమన్నాయి. అలాగే నువ్వు చేసిన అభివృద్ధి చెప్పరా నాయనా అంటే..ప్రతిసభలోనూ పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు..పవన్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ పవన్ సతీమణులను పెళ్లాలు అంటూ అగౌరవంగా నీచంగా మాట్లాడిన వ్యక్తి జగన్. ఇక లోకేశ్ ను పవ్పూ అంటూ, ఆయన భాషను ట్రోల్ చేసిన ఘనత వైసీపీ నేతలది.

కర్మఫలం ఎక్కడిపోదు అని పెద్దలు చెబుతుంటారు. నిన్న వచ్చిన ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించింది టీడీపీ కూటమి. వైసీపీ నేతలకు ముఖ్యంగా జగన్, రోజా, కొడాలి, అంబటి లాంటి వాళ్లకు నిద్రకరువు చేసింది. అప్పుడు దుర్మార్గంగా ట్రోల్స్ చేసిన వైసీపీకి..ఇప్పుడు అదే రీతిలో సమాధానం చెబుతున్నాయి టీడీపీ, జనసేన. జగన్ పై ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అందులో కొన్ని చంద్రబాబు కింద బంట్రోతులా జగన్ ఉన్న ఫొటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇంకా కొన్ని..‘‘ తట్టబుట్ట సర్దుకుని మేము సిద్ధం..’’ అంటూ ఓ మీమ్ తెగ నవ్విస్తోంది. ఇంకా ఎన్నో ట్రోల్స్ జగన్ అండ్ కో పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చేసిన పాపం పోదు కదా..అప్పుడు వాళ్లు చేశారు..ఇప్పుడు వీళ్లు చేయాల్సిందే కదా. వైసీపీ వాళ్లకు అలా చేస్తేనే అర్థమవుతుంది కూడా.

Exit mobile version