JAISW News Telugu

Naga Manikantha : బిగ్ బాస్ కంటెస్ట్ నాగ మణికంఠపై ట్రోల్స్.. సింపతి గేమ్ ఆడతావా..

Naga Manikantha

Naga Manikantha

Naga Manikantha : బిస్ బాస్ సీజన్ 8 లో నాగ మణికంఠ అనే కంటెస్ట్ చాలా ఎమోషనల్ అవుతూ సింపథీ గేమ్ ఆడుతున్నాడు. ఈ విషయాన్ని ఆడియన్స్ ఇప్పటికే గమనించారు. అయితే మొదటి వారంలో ఎలిమినేషన్ లో ఉన్న నాగ మణికంఠ తన కుటుంబ సభ్యులు, భార్య గురించి చెప్పి కన్నీళ్లు పెట్టించారు. అయితే ఇదంతా నిజమని నమ్మిన ఆడియన్స్ నాగ మణికంఠకు సపోర్టుగా నిలిచారు.

నాగ మణికంఠ తన భార్య గురించి కూడా మొదటి వారంలో చాలా నెగిటివ్ గా చెప్పాడు.  ఇంత చెబుతున్నాడు. ఎవరీ వ్యక్తి.. అనుకుంటూ నాగ మణికంఠ ఫ్యామిలీ ఫొటోలు సెర్చ్ చేయడం మొదలెట్టారు. ఇందులో నాగ మణికంఠకు సంబంధించిన పెళ్లి ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. నాగ మణికంఠ భార్య అచ్చం కితకితలు సినిమాలో హీరోయిన్ లా ఉందంటూ దారుణంగా కామెంట్లు పెట్టారు. బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేశారు. ఈ విషయం నాగ మణికంఠ సిస్టర్ కావ్య అమరనాథ్ కు తెలియడంతో  రియాక్ట్ అయ్యింది.

ఇలా మా వదినపై కామెంట్స్ చేసే వాళ్లు ఒకసారి వారి ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. ఒక మహిళపై ఇలా కామెంట్స్ చేయడం ఏంటనీ మండిపడ్డారు. మా వదిన బంగారం అని ఆమె అమ్మతో సమానం అని చెప్పింది. దీంతో నాగ మణికంఠ భార్య గొప్పతనం తెలుసుకున్న ట్రోలర్స్ కాస్త వెనకంజ వేశారు.

కానీ ఈ సారి నాగ మణికంఠపై విరుచుకు పడుతున్నారు. నాగ మణికంఠ ఏంటీ ఇలా అబద్ధాలు చెబుతావా? భార్య గురించి, కుటుంబ సభ్యుల గురించి తప్పుగా బిగ్ బాస్ లో అందరి ముందు చెబుతావా అంటూ మండిపడుతున్నారు. నాగ మణికంఠ పై ట్రోల్స్ పెంచేశారు. వీడో సింపథీ స్టార్ అంటూ ఏదైనా మాట్లాడాలంటే ఏడుస్తూ అందరినీ ఎమోషనల్ చేస్తూ నటిస్తున్నాడని అంటున్నారు.

Exit mobile version