Kavya Maran : సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పై మళ్లీ దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ ఇచ్చిన 207 పరుగుల టార్గెట్ ను చేరుకోలేక కేవలం 170 పరుగులే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయి దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు.
ఈ మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. ఇప్పటికే ఏడు మ్యాచుల్లో మూడు సార్లు 250 పరుగుల పైగా చేసి తామెంటో నిరూపించుకున్నారు. బ్యాటింగ్ లో అదరగొట్టడంతో పాటు ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడారు. అంతలా బ్యాటింగ్ లో కసిగా కొడుతున్న సన్ రైజర్స్ బ్యాటర్లు ఆర్సీబీ తో మ్యాచ్ లో తేలిపోయారు. హెడ్ 1, అభిషేక్ శర్మ 31, క్లాసెన్ 7, మార్కమ్ 7, సమద్ 10, నితీశ్ రెడ్డి 13 ఇలా అందరూ విఫలమయ్యారు. దీంతో టార్గెట్ చేజ్ చేయలేక చతికిలపడింది టీమ్.,
అయితే మొన్నటి వరకు కావ్య మారన్ నవ్వుల్లో మునిగి తేలింది. స్టేడియంలో ఎక్కడ చూసినా అభిమానుల కేరింతలు, కావ్య మారన్ ముసిముసి నవ్వులే కనిపించాయి. కానీ ఉప్పల్ లో సీన్ రివర్స్ అయింది. ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో వికెట్లు పడుతున్న కొద్దీ కావ్య మారన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. ఆమె చిరాకు పడటం, అరవడం చూసి అందరూ అయ్యో పాత కావ్య మళ్లీ వచ్చేసిందిరోయ్ అని తెగ కామెంట్లు చేస్తున్నారు.
కావ్యమారన్ ఓనర్ గా సన్ రైజర్స్ టీంను నడిపిస్తోంది. కావ్యకు క్రికెట్ అంటే పిచ్చి. ఎవరైనా బ్యాట్స్ మెన్ నార్మల్ గా వికెట్ పొగోట్టుకుంటే ఆమె తట్టుకోలేదు. అంతలా మ్యాచ్ లో లీనమైపోతుంది. తన జట్టు పర్ఫామెన్స్ బాగున్నప్పడు ఎంతలా ఆనందిస్తుందో.. వారు బాగా ఆడలేనప్పుడు కూడా అంతలా కుమిలిపోతుంది. ఆర్సీబీతో మ్యాచ్ లో సన్ రైజర్స్ వికెట్స్ ఇలా పడిపోతుంటే అలా ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ పై ట్రోల్స్ పేలుతున్నాయి.