Trivikram : అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన త్రివిక్రమ్.. మహేష్ తో ముదిరిన గొడవలు!

Trivikram

Trivikram

Trivikram : టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్ 3 లో ఎదో ఒక స్థానం లో ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈమధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ లో ఒకప్పుడు ఉన్న పనితీరు కనిపించడం లేదు. ఉదాహరణకి రీసెంట్ గా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రమే. ఈ సినిమాని చూసిన ఎవరికైనా ఈ చిత్రానికి డైరెక్టర్ నిజంగా త్రివిక్రమేనా అని అనిపించక తప్పదు.

అంత చెత్తగా తీసాడు, సంక్రాంతి కాబట్టి సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మోస్తారు గా ఆడి నిలబడింది కానీ, లేకపోతే ఈ చిత్రం బ్రహ్మోత్సవం రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. కేవలం గుంటూరు కారం చిత్రం కి మాత్రమే కాదు. ఈ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ మరియు ‘భీమ్లా నాయక్’ చిత్రాలకు ఈయన కథ, మాటలు అందించాడు.

ఈ రెండు సినిమాల్లో  ఏదైనా ఉందా అంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే రైటింగ్ అని అంటుంటారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల భీమ్లా నాయక్ హిట్ అయ్యింది, బ్రో చిత్రం ఒక మోస్తారు గా ఆడింది కానీ, లేకపోతే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు అయ్యేవి అని ట్రేడ్ పండితులు చెప్పే మాట. ఇకపోతే ‘గుంటూరు కారం’ చిత్రం విడుదల తర్వాత త్రివిక్రమ్ మూవీ టీం కి అందుబాటులో లేదట. మొన్న సక్సెస్ పార్టీ కి రమ్మని ఫోన్ చేసి పిలవడానికి ప్రయత్నం చేసినా ఆయన స్పందించలేదట. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఆయన ఈ సినిమా ఫలితం పై పట్ల బాగా డిస్టర్బ్ అయ్యాడని. తనలో మునుపటి వైభవం మిస్ అయ్యిందనే నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకనే ఇలా అజ్ఞాతం లోకి వెళ్లాడా అంటే అవుననే అంటున్నారు ఆయన అభిమానులు.

ఉదాహరణకి ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఫ్లాప్ అయినా తర్వాత, పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు మాటలు, స్క్రీన్ ప్లే రాసాడు. ఒక్క సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా ఆయన హాజరు కాలేదు. దీని అర్థం ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తన ముఖం చూపించుకోలేకపోతున్నాడు అని. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ విషయం లో కూడా అదే జరగబోతుందా అంటే అవుననే చెప్పాలి. మళ్ళీ త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చెయ్యబోయే సినిమాతో మాస్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

TAGS