JAISW News Telugu

Trivikram : డైరెక్షన్ కి గుడ్ బై చెప్పబోతున్న త్రివిక్రమ్..? కొత్త వ్యాపారంలోకి అరంగేట్రం!

Trivikram

Trivikram

Director Trivikram : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోయే చిత్రాలను అందించిన దర్శకులలో ఒకడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి తన స్నేహితుడు సునీల్ తో కలిసి భీమవరం నుండి హైదరాబాద్ కి వచ్చిన త్రివిక్రమ్, ఒక్క అవకాశం కోసం కాళ్ళు అరిగిపోయేలా స్టూడియోస్ చుట్టూ తిరిగిన రోజులు అంత తేలికగా మరిచిపోలేడు.

అలా కష్టపడిన త్రివిక్రమ్ కి విజయ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కే సినిమాలకు మాటలు, స్క్రీన్ ప్లే, కథ అందించే అదృష్టం దొరికింది. అలా ‘స్వయంవరం’ సినిమాతో మొదలైన త్రివిక్రమ్ కెరీర్, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ‘చిరునవ్వుతో’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ , ‘మన్మథుడు’ ఇలా ఒక్కటా రెండా విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన అత్యధిక సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు, కల్ట్ క్లాసిక్స్ అయ్యాయి.

ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతంగా దర్శకుడిగా మారి తరుణ్ తో ‘నువ్వే నువ్వే’ అనే సినిమా తీసాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ కెరీర్ ఎలా దూసుకెళ్ళిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలలో ఖలేజా, అజ్ఞాతవాసి మరియు రీసెంట్ గా గుంటూరు కారం చిత్రాలు మాత్రమే కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి.అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్ లో పదును తగ్గింది, అలాగే స్క్రీన్ ప్లే రైటింగ్ లో ఇంతకు ముందు ఉన్నంత నైపుణ్యం లేదు. ఈ విషయం ‘గుంటూరు కారం’ సినిమా చూస్తే ఎవడికైనా అర్థం అయిపోతుంది.

అందుకే త్రివిక్రమ్ ఇప్పుడు హడావడి గా మరో సినిమా చెయ్యకుండా, కొంతకాలం గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాడట. దర్శకత్వం కి కొన్ని రోజులు బైబై చెప్పేసి , నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాలని చూస్తున్నాడట. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ – అట్లీ కాంబినేషన్ లో త్వరలో రాబొయ్యే సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. ఈ సినిమా సక్సెస్ అయితే ఇక కొంతకాలం నిర్మాతగా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Exit mobile version