Trisha : చాలా మందితో రిలేషన్ పెట్టుకున్నా.. బాంబ్ పేల్చిన త్రిష!

Trisha

Trisha

Trisha : జోడి (1999)లో సపోర్టింగ్ యాక్టర్ (హీరోయిన్ ఫ్రెండ్)గా కెరీర్ మొదలు పెట్టిన త్రిష ‘ద క్వీన్ ఆఫ్ సౌత్’గా ఎదిగింది. దక్షిణ భారతంలో ఎక్కువ సినిమాలు చేసి మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్, కోలివుడ్ లో పాతుకుపోయింది. తెలుగులో సీనియర్ స్టార్ల సరసన హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది. తెలుగునాట ఈమెకు ఉన్న అభిమానులు మరే భాషలో లేరంటే సందేహం లేదు.

కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది త్రిష. ప్రశంసలు, విమర్శల గురించి మాట్లాడుకుంటే లెక్కే లేదు. కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె మణిరత్నం అద్భుత సృష్టి ‘పొన్నియన్ సెల్వన్’లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాతి నుంచి వరుస  ప్రాజెక్టులు చేస్తూ వెళ్తోంది. తెలుగులో పాటు తమిళం, మలయాళం భాషల్లో ఎక్కువగా చిత్రాలు ఉన్నాయి. మెగాస్టర్ భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’లో కూడా కనిపింబోతోంది.

ఇదంతా పక్కన పెడితే.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను తెలిపింది. వివాహం, రిలేషన్ షిప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను చాలా మందితో డేటింగ్ చేశా. రిలేషన్‌షిప్ కూడా పెట్టుకున్నా ఇప్పటి వరకు ఏది కూడా వర్కవుట్ కాలేదు. రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులతో జీవితం ఆనందంగా ఉండదు. వివాహం అంటే ఒక పెద్ద బాధ్యత, అది నా వల్ల కాదనే అనుమానం వచ్చింది. ఇప్పుడున్న వయసులో నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. సెల్ఫ్ లవ్ చాలా అద్భుతం. ఒకరి కోసం కంటే మన కోసం మనం జీవించినప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది.’ అని చెప్పుకొచ్చింది.

TAGS