Trisha Marriage Soon : పెళ్ళైన స్టార్  హీరోపై మోజుపడ్డ స్టార్ హీరోయిన్ త్రిష..త్వరలోనే వివాహం!

Trisha Marriage Soon

Trisha Marriage Soon

Trisha Marriage Soon : సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో త్రిష కృష్ణన్ ని ముందు వరుసలో పెట్టొచ్చు. మనం చిన్నతనం లో ఉన్నప్పటి నుండి సినిమాలు చేస్తూనే ఉంది. ఈమెతో కెరీర్ ని ప్రారంభించిన ఎంతో మంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోయి, క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేసే స్థితికి వచ్చారు.

కానీ త్రిష మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరని అందం తో, మెయిన్ హీరోయిన్ రోల్స్ చెయ్యడమే కాకుండా, సూపర్ హిట్స్ ని కూడా అందుకుంటుంది. గత ఏడాది ఆమె పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో కథానాయకగా నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది. అదే ఏడాది తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘లియో’ చిత్రం లో హీరోయిన్ గా నటించి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. అలా ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూ సూపర్ హిట్స్ ని అందుకుంటూనే ఉంది త్రిష.

ఇదంతా పక్కన పెడితే త్రిష కి కాంట్రవర్సీలు కొత్తేమి కాదు, సూచి లీక్స్ అప్పుడు ఈమెకి ఎంత మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయో బయటపడింది. అయితే ఈమె చాలా కాలం నుండి ప్రముఖ హీరో విజయ్ తో డేటింగ్ లో ఉంటున్నట్టుగా వార్తలు వినిపించాయి. ప్రతీ చిన్న రూమర్ కి స్పందించే గుణం ఉన్న త్రిష, తమిళనాడు సినీ ఇండస్ట్రీ మొత్తం మారుమోగుతున్న ఈ గాసిప్ మీద మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

ఇండస్ట్రీ అన్న తర్వాత రూమర్స్ సహజం కదా,వేల మీద కూడా వచ్చింది రూమర్ ఏమో అని అనుకున్నారు నెటిజెన్స్. కానీ ఇటీవలే ఇన్కమ్ టాక్స్ అధికారులు త్రిష ఇంటిని సోదా చేశారట. ఈ సోడాలో అంత పెఫెక్ట్ గానే ఉంది కానీ, రెండు కోట్ల రూపాయిల విలువ చేసే నెక్లెస్ కి సంబంధించి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవట.

దాని గురించి అధికారులు త్రిష ని అడగగా , అది తమిళ హీరో విజయ్ బహుమతిగా ఇచ్చాడని చెప్పిందట. దర్యాప్తు చేస్తే అది నిజమేనని కూడా తేలిందట. ఈ విషయమే ఇప్పుడు తమిళనాడు లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ గత కొంతకాలం నుండి తన భార్య తో దూరంగా ఉంటున్నాడు. విడాకులకు కూడా దరఖాస్తు చేసాడని అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఈ సంఘటన చూస్తే ఇవంతా రూమర్స్ కాదు నిజమేనని అనిపిస్తుంది.

TAGS