Trinatha Rao-Sandeep Kishan : నక్కిన త్రినాథ రావు రవితేజతో తీసిన దమాకా మూవీ హిట్ కావడంతో ఆయన కు దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు తో ఒక సినిమా చేయాలని ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాడట. కానీ ఇంతవరకు ఆ సినిమా పట్టాలకెక్కలేదని తెలుస్తోంది. ఈ లోపే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తో సందీప్ కిషన్ తో మరో మూవీ తీసేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సినిమా ప్రారంభ ముహుర్తం ఈ నెల 23 న పెట్టుకున్నాడు. ఇప్పుడు దిల్ రాజు ఈ సినిమా షూటింగ్ కు ఏమైనా అడ్డుపడతాడా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే కథను చిరంజీవి కూతురు సుష్మితకు చెప్పగా.. తన తండ్రితో తీయాలని అనుకుంది. అయితే ఎందుకో ఆ ఆలోచన మధ్యలోనే ఆగిపోయింది. అయితే సుష్మిత మళ్లీ ఈ కథను వారికే ఇచ్చేశారనే టాక్ వినిపిస్తోంది.
సందీప్ కిషన్, త్రినాథ రావు ఇద్దరు ఇప్పటికే ఊరు పేరు బైరవ కోన ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. దమాకా మూవీ తర్వాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు ఒప్పుకున్న డైరెక్టర్ త్రినాథ రావు అడ్వాన్స్ తీసుకుని ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని టాక్. ఇంతలోనే సందీప్ కిషన్, ఏకే ఎంటర్ టైన్ మెంట్ తో మరో సినిమా చేస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు ఏమైనా అడ్డంకులు వస్తాయేమోనని భయపడుతున్నారని తెలుస్తోంది.
నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుని వారి సినిమాలు కాకుండా వేరే సినిమాలు చేస్తుంటే అగ్ర నిర్మాతల కోపానికి గురికాక తప్పదు. ఇదే విషయంలో చాలా సార్లు నిర్మాతలు, డైరెక్టర్ల మధ్య గొడవలు కూడా జరిగాయి. అల్లు అరవింద్ అయితే పరశురామ్ అనే డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు కూడా. గతంలో తన దగ్గర అడ్వాన్స్ తీసుకుని దిల్ రాజు కు ముందు వర్క్ చేయడం ఏంటనీ అల్లు అరవింద్ అనడం అప్పట్లో సంచలనం గా మారింది. మరి దిల్ రాజు ఈ సినిమా నిర్మాణ సమయంలో డైరెక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటాడనేది సస్పెన్స్ గా ఉంది.