Mahatma Gandhi : మహాత్మా గాంధీకి నివాళులు.. సీఎం రేవంత్, మంత్రులతో బీజేపీ ఎంపీ లక్ష్మణ్

Tributes to Mahatma Gandhi
Tributes to Mahatma Gandhi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద గాంధీ సమాధికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. బాపు ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు చేశారు. అదే సమయంలో బాపు ఘాట్ వద్దకు బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ వచ్చారు. సీఎం మంత్రులతో కలిసి ఆయన కూడా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేత హనుమంత రావు, వ్యవసాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.