
Nasrallah
Nasrallah Death News : నస్రల్లా మృతికి నివాళిగా ఇరాక్ లోని 100 మంది శిశువులకు ఆయన పేరు పెట్టారు. గత వారం ఇజ్రాయెల్ బీరుట్ పై దాడులు నిర్వహించగా హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మృతికి నివాళిగా ఇరాక్ లోని వంద మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టారు. ఈ మేరకు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నస్రల్లా హత్యను నిరసిస్తూ దేశంలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో ఆయన మృతికి నివాళిగా ఇరాక్ లో జన్మించిన వంద మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టామని ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక, ‘నీతివంతుడైన నస్రల్లా అమరవీరుడు’ అని ఇరాక్ ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుదానీ అభివర్ణించారు. ఇదెలా ఉండగా హసన్ నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.