ట్రెండింగ్ లో ‘#arrsairaabreakup’
arrsairaabreakup : భారతీయ సంగీత పరిశ్రమకు మార్గదర్శకుడు, సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ అతని భార్య సైరా భానుతో 29 ఏళ్ల వివాహ జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వార్త సోషల్ మీడియాలో గత రాత్రి (నవంబర్ 19) ట్రెండింగ్ గా మారింది. రెహమాన్ తన ఎక్స్ (ట్విటర్) పేజీలో విడాకుల గురించి ఆసక్తికరంగా స్పందించారు. తను హ్యాష్ ట్యాగ్ పెట్టి మారీ పోస్ట్ చేశాడు. రెహమాన్ ట్వీట్ చేస్తూ, ‘మేము గ్రాండ్ థర్టీకి చేరుకోవాలని ఆశించాం, కానీ అన్ని అనుకున్నట్లు జరుగవు. తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. విరిగిన హృదయాల బరువుకు భగవంతుడి సింహాసనం కూడా వణుకక తప్పదుగా. ఇది ఎలా జరిగిందన్న దానికి ఇంకా మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ‘#arrsairaabreakup’ అనే హ్యాష్‌ట్యాగ్’తో రెహెమాన్ ముగించాడు. సాధారణంగా, విడాకులు, బ్రేకప్‌కు సంబంధించి నిర్ణయాలు చాలా బాధగా ఉంటాయి. రెహ్మాన్ – సైరా 1995లో వివాహం చేసుకున్నారు. 29 సంవత్సరాలు కలిసి ఉన్నారు ముగ్గురు పిల్లలకు వీరు జన్మనిచ్చారు.