JAISW News Telugu

India to America : ఇండియా నుంచి అమెరికాకు 30నిమిషాల్లోనే ప్రయాణం

India to America

India to America

India to America : అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తర్వాత ఆయన సన్నిహితుడు ఎలోన్ మస్క్ పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇప్పటికే ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి కేటాయించారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే మస్క్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవాత్మక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కొత్త సాంకేతికతను పరిచయం చేస్తుంది. అది స్టార్‌షిప్ రాకెట్. దీని సాయంతో ప్రపంచంలోని ఏ దేశానికైనా ప్రయాణికులు 30 నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. మరి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.

అమెరికా టు ఇండియా 30 నిమిషాల ప్రయాణం
లాస్ ఏంజిల్స్ నుండి టొరంటో – 24 నిమిషాలు
ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో – 30 నిమిషాలు
న్యూయార్క్ నుండి షాంఘై, హాంకాంగ్ – 39 నిమిషాల్లో చేరుకోవచ్చు

ఇది ఎర్త్ టు ఎర్త్ స్టార్ షిప్ రాకెట్. ఇది దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుంది. స్టార్‌షిప్ రాకెట్‌లో వెయ్యి మంది ప్రయాణించవచ్చు. భూ కక్ష్యలోకి వెళ్లి, ఆపై గమ్యాన్ని చేరుకుంటుంది. ఇది నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. సాధారణంగా, విమానంలో ఢిల్లీ నుండి న్యూయార్క్ నగరానికి చేరుకోవడానికి కనీసం 16 గంటలు పడుతుంది. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ సమయాన్ని 30 నిమిషాలకు తగ్గించనుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ అది సాధ్యమే. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కొన్నేళ్లలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

Exit mobile version